Share News

వెంకటరెడ్డికి డిప్యుటేషన్‌ పొడిగింపు

ABN , First Publish Date - 2023-11-29T03:44:39+05:30 IST

గనుల శాఖలో రెండు కీలక పదవుల్లో ఉన్న వి.జి. వెంకటరెడ్డి లక్కీ చాన్స్‌ కొట్టేశారు. రిటైర్‌మెంట్‌ వరకు ఏపీలోనే సర్వీసు చే సేలా ఆయనకు డిప్యుటేషన్‌ పొడిగింపు లభించింది.

వెంకటరెడ్డికి డిప్యుటేషన్‌ పొడిగింపు

రిటైరయ్యేదాకా వెంకటరెడ్డి ఇక్కడే

ఆగస్టులోనే కోస్ట్‌గార్డ్‌కు సీఎస్‌ లేఖ

ప్రత్యేక ఉత్తర్వులు తెచ్చిన సర్కారు

ఇది సర్వీసు నిబంధనల ఉల్లంఘనే?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గనుల శాఖలో రెండు కీలక పదవుల్లో ఉన్న వి.జి. వెంకటరెడ్డి లక్కీ చాన్స్‌ కొట్టేశారు. రిటైర్‌మెంట్‌ వరకు ఏపీలోనే సర్వీసు చే సేలా ఆయనకు డిప్యుటేషన్‌ పొడిగింపు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని మరీ ఈ అవకాశం కల్పించింది. గనుల శాఖలో ఆయన సేవలు ఎంతో అవసరమని భావించిన సర్కారు, సర్వీసు చివరి వరకు ఇక్కడే పనిచేసేలా కేంద్ర రక్షణశాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు తీసుకొచ్చింది. వి.జి వెంకటరెడ్డి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ సర్వీసులో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ (ట్రైనింగ్‌)గా పనిచేస్తున్నారు. జగన్‌ సర్కారు వచ్చాక 2019లో ఆయన డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. తొలుత విద్యాశాఖలో స్పెషల్‌ సెక్రెటరీగా, అనంతరం గనుల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత గనుల శాఖలో నే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ఎండీగా నియమితులయ్యారు. ఈ అక్టోబ రుతో డిప్యుటేషన్‌ కాలపరిమితి ముగియడంతో ఆయన సొంత సర్వీసుకు వెళ్లాల్సి ఉంది. అయితే, ఆయన సేవలు గనుల శాఖలో ఎంతో కీలకమని సర్కారు భావించింది. దీంతో వచ్చే ఏడాది జూలై 31 వరకు ఆయన డిప్యుటేషన్‌ను పొడిగించాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి నుంచి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ డైరెక్టర్‌ జనరల్‌కు ఈ ఏడాది ఆగస్టులోనే లేఖ వెళ్లింది. నెల రోజుల తర్వాత అంటే సెప్టెంబరులో అనేక పరిణామాల అనంతరం పొడిగింపునకు అనుమతి వచ్చింది. దీంతో ఆయన వచ్చే ఏడాది జూలై 31 వరకు పనిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు (జీవో 2006) ఇచ్చింది. వెంకటరెడ్డి సర్వీసు వచ్చే ఆగస్టు వరకు ఉంది. సెంట్రల్‌ సర్వీసు నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి అయినా డిప్యుటేషన్‌లో ఉంటే, పదవీ విరమణకు చివరి ఆరు నెలల ముందు సొంత విభాగానికి చేరుకోవాలి. ఈ లెక్కన వెంకటరెడ్డి తిరిగి సొంత విభాగానికి వెళ్లాలి. అయితే, రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, రిటైర్‌మెంట్‌ వరకు ఏపీలోనే పనిచేసేలా కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చింది.

Updated Date - 2023-11-29T03:44:40+05:30 IST