దోపిడీని బయటపెడతా: మర్రెడ్డి

ABN , First Publish Date - 2023-06-02T04:29:07+05:30 IST

రైతు భరోసా చెల్లింపులు, ధాన్యం కొనుగోళ్లలో జరిగిన దోపిడీని త్వరలోనే ప్రజల ముందు పెడతామని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

దోపిడీని బయటపెడతా: మర్రెడ్డి

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా చెల్లింపులు, ధాన్యం కొనుగోళ్లలో జరిగిన దోపిడీని త్వరలోనే ప్రజల ముందు పెడతామని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతు భరోసాపై ముఖ్యమంత్రి చెప్పేవన్నీ క్విడ్‌ ప్రోకో లెక్కలే. రాష్ట్రంలో పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారులు 36 లక్షల మంది అని కేంద్రం చెప్తుంటే... జగన్‌రెడ్డి మాత్రం రైతు భరోసా – పీఎం కిసాన్‌ 52.30 లక్షల మందికి ఇస్తున్నట్లు చెప్పడం అబద్ధం కాదా? నాలుగేళ్లలో ఒక్కో రైతుకు రూ.7,500 మాత్రమే తాను ఇచ్చి, రూ.50 వేలు ఇచ్చానని చెప్పడం పచ్చి అబద్ధం’’ అని మర్రెడ్డి అన్నారు.

Updated Date - 2023-06-02T04:29:18+05:30 IST