విద్యార్థి జేబులో పేలిన సెల్‌ఫోన్
ABN , First Publish Date - 2023-07-08T03:03:31+05:30 IST
స్కూటీపై వెళుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి జేబులోని మొబైల్ ప్చేలింది. దీంతో అతను అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు...
స్కూటీ అదుపుతప్పి కింద పడి తీవ్ర గాయాలు
కావలి రూరల్, జూలై 7: స్కూటీపై వెళుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థి జేబులోని మొబైల్ ప్చేలింది. దీంతో అతను అదుపు తప్పి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కథనం మేరకు... నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం చిన్నపవనికి చెందిన సాయి ప్రదీప్ ఇటీవల ఆన్‌లైన్‌లో ఓ స్మార్ట్ ఫోన్ (పోకో) కొనుగోలు చేశాడు. శుక్రవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్‌ఎ్‌సఆర్ కళాశాలలో సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు స్వగ్రామం నుంచి స్కూటీపై బయలుదేరాడు. మార్గమధ్యంలో కొత్తపల్లి వద్ద ప్యాంటు జేబులోని సెల్‌ఫోన్ పేలడంతో అదుపుతప్పి బస్టాండ్ సమీపంలోని సిమెంట్ బల్లను ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సాయిప్రదీ్‌పను 108 వాహనంలో కావలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కావలి రూరల్ ఎస్‌ఐ సుమన్ బాధితుడిని పరామర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.