Share News

తొలి యత్నంలోనే ఎవరెస్టు పైకి

ABN , Publish Date - Dec 26 , 2023 | 03:09 AM

తొలి ప్రయత్నంలోనే తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ జంట ఎవరెస్టు ఎక్కేసింది. జాతీయ జెం డాను బేస్‌ క్యాంపు వద్ద రెపరెపలాడించింది.

తొలి యత్నంలోనే ఎవరెస్టు పైకి

తిరుపతి సాఫ్ట్‌వేర్‌ జంట సాహస యాత్ర

తిరుపతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యో తి): తొలి ప్రయత్నంలోనే తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్‌ జంట ఎవరెస్టు ఎక్కేసింది. జాతీయ జెం డాను బేస్‌ క్యాంపు వద్ద రెపరెపలాడించింది. తిరుపతి రా మచంద్ర నగర్‌కు చెందిన కృష్ణమూర్తి, ధనంజయ దంపతు ల కుమారుడు కిరణ్‌ మోహన్‌. భాగ్యశ్రీతో వివాహమైంది. బెంగళూరులో ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో చూ శారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండేందుకు నెలరోజుల పాటు సాధన చేశారు. నవంబరు 12న నడక ప్రారంభించారు. తొలి ప్రయత్నంలోనే, 20వ తేదీన 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కు చేరి మువ్వన్నెల జెండాను పాతారు. నేపాల్‌-లుక్లా నుంచి బయలుదేరిన 8 మంది బ్యాచ్‌లో వీరిద్దరే ఎలాంటి అనుభవం లేనివారు. ఆ ప్రయాణం గురించి వారిరువురూ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ‘మార్గం మధ్యలో మౌంటెన్‌ సిక్‌నె్‌సకు గురయ్యాం. సగం దారి లో ఉండగానే భాగ్యశ్రీకి రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి 73కి పడిపోయింది. తలనొప్పి, వికారం, ఆకలి నశించడం వంటి లక్షణాలు కనిపించాయి. ఒకానొక దశలో వెనక్కి వెళ్లాల్సి వస్తుందేమోనని అనుకున్నాం. ఎలాగో తట్టుకొని నిలబడ్డాం. బేస్‌క్యాంప్‌ సమీపించే కొద్దీ మైనస్‌ 16 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతనూ తట్టుకోవాల్సి వచ్చింది. ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ వద్ద 50 శాతం ఆక్సిజన్‌ మాత్ర మే లభిస్తుంది. స్నానం చేయడం కుదరదు కాబట్టి వెట్‌వై్‌ప్సతో శుభ్రం చేసుకునేవాళ్లం. నీళ్లు తాగుతూ ముందుకు సాగాం. బేస్‌ క్యాంప్‌ను చూడగానే భావోద్వేగాలతో పులకించిపోయాం. మరిచిపోని, మధురమైన అనుభూతి చెందాం. ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు ఖర్చయింది’’ అని కిరణ్‌ మోహన్‌, భాగ్యశ్రీ వివరించారు.

Updated Date - Dec 26 , 2023 | 03:09 AM