మొన్న అడ్డుకున్నా... నేడు సజావుగా పనులు

ABN , First Publish Date - 2023-01-29T23:45:15+05:30 IST

రెండు రోజులుగా ఆ వెంచర్లలో రహదారుల పనులను ఎక్స్‌వేటర్‌తో సాగుస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

మొన్న అడ్డుకున్నా... నేడు సజావుగా పనులు

అధికారులపై ప్రజలు విమర్శలు

గాండ్లపెంట, జనవరి 29: కొద్దిరోజుల క్రితం రాత్రికిరాత్రే వెంచర్లకు ట్రిపర్లలో మట్టిని తోలారు. వెంచర్లలో రహదారులు వేయడానికి సాగిస్తు న్న పనులను రెవెన్యూ అధికారులు అడ్డుకుని ఎక్స్‌కవేటర్‌ను వెనక్కు పంపారు. అయితే రెండు రోజులుగా ఆ వెంచర్లలో రహదారుల పనులను ఎక్స్‌వేటర్‌తో సాగుస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అధికారులకు వెంచర్ల యజమానులతో డీల్‌ కుదిరిందేమో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల చేయి తడిపితే ఎలాంటి పను లైనా సులువుగా జరుగుతాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ని పలువురు రెవెన్యూ అధికారులు అవినీతి, అక్రమాలపై గతంలో ఉన్నతాధికారులు విచారణ చేసిన విషయం తెలిసిందే. నూతనంగా మండలకేంద్రంలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతులు లేని వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలోకి దాదాపు పదిహేను రోజుల క్రితం రాత్రికి రాత్రే వెంచర్లకు వంద ట్రాక్టర్లకుపైగా మట్టిని తోలారు. మట్టితోలడానికి కూడా అనుమతులు లేవు. ఆ మట్టితో వెంచర్లలో రోడ్లు వేస్తుంటే రెవెన్యూ సిబ్బంది అడుకున్నారు. కానీ రెండు రోజల నుంచి వెంచర్ల వేయడానికి ఎక్స్‌కవేటర్‌తో పనులు సజావుగా సాగుతున్నాయి. అయినా పట్టించుకునే వారేలేరు. ఇందులో అంతర్యమేమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులతో డీల్‌ కుదిరిందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో రెవెన్యూ అధికారుల పట్ల ప్రజల నుంచి పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మండలంలో పలు వెంచర్లకు ఎలాంటి రహదారి, తాగునీరు, దీపాలు లేకపోయినా కూడా వెంచర్లలో ప్లాట్లు అమ్ముకుని రియల్టర్లు అమ్ముకుని, అధికారులు చేయి తడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తహసీల్దార్‌ రవిని వివరణ కోరగా... లేఅవుట్ల అనుమతికి వచ్చినప్పుడు అదనపు రుసుం వేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మట్టి ఎక్కడి నుంచి తరలించారో తమకు తెలియదంటూ సమాధానం ఇచ్చారు.

Updated Date - 2023-01-29T23:45:18+05:30 IST