పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ ఏర్పాటు
ABN , First Publish Date - 2023-06-07T03:38:09+05:30 IST
ఏపీ పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ చట్టం–2023 ఈ నెల 5 నుంచి అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది.
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఏపీ పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ చట్టం–2023 ఈ నెల 5 నుంచి అమలులోకి తెస్తూ ప్రభుత్వం మంగళవారం గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ డిప్లొమా హోలర్లు, వీరికి శిక్షణ ఇచ్చే సంస్థల రిజిస్ట్రేషన్ కోసం పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కౌన్సిల్ చైర్మన్‌గా ప్రిన్సిపల్ సెక్రటరీ, వైస్‌చైర్మన్‌గా శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వీసీ, సభ్య కన్వీనర్‌గా పశుసంవర్థక శాఖ డైరెక్టర్, వివిధ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు