ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతం: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2023-03-19T02:05:18+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతమని, ప్రభుత్వం పట్ల విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది ఒక సంకేతమని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా చైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు.

ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతం: తులసిరెడ్డి

వేంపల్లె, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి శరాఘాతమని, ప్రభుత్వం పట్ల విద్యావంతుల్లో ఉన్న వ్యతిరేకతకు ఇది ఒక సంకేతమని కాంగ్రెస్‌ రాష్ట్ర మీడియా చైర్మన్‌ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శనివారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘అనేక వాగ్దానాలు చేసి ఉద్యోగులను, నిరుద్యోగ యువతను నమ్మించి మోసగించిన ఫలితమే ఈ ఘోర పరాభవం. ఇప్పటికైనా రాజధాని తరలించే నిర్ణయాన్ని వైసీపీ విరమించుకోవాలి. వైసీపీ మునిగిపోయే పడవ. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలి. స్వగృహ ప్రవేశం చేయాలి’’ అని తులసిరెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-19T02:05:18+05:30 IST