Share News

దాతలారా.. ఆదుకోండి!

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:21 AM

గతంలో ప్రొవిజన్స్‌ సరఫరాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి ఏ జిల్లాకు సంబంధిం చి ఆ జిల్లాలోని సరఫరాదారులకు అప్పగించారు.

దాతలారా.. ఆదుకోండి!

గురుకులాల్లో సౌకర్యాలు కల్పించండి

సంక్షేమ గురుకులాల యాజమాన్యం విజ్ఞప్తులు

పూర్వ విద్యార్థులను కోరుతూ నోటీసు బోర్డుల్లో వినతి

ప్రభుత్వం సౌకర్యాలు కల్పించలేదంటూ ఆవేదన

సంక్షేమ గురుకులాల్లో దుర్భర పరిస్థితి

గ్రీన్‌ చానల్‌ అమలేది?

గతంలో ప్రొవిజన్స్‌ సరఫరాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి ఏ జిల్లాకు సంబంధిం చి ఆ జిల్లాలోని సరఫరాదారులకు అప్పగించారు. సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులివ్వకపోవడంతో కలెక్టరేట్‌లో తమ గోడు విన్నవించుకున్నా... పట్టించుకునేవారు లేరంటున్నారు. గతంలో సంక్షేమ హాస్టళ్ల సరఫరాకు బిల్లుల చెల్లింపుల్లో అమలుచేసిన గ్రీన్‌ చానల్‌ ఏమైందో ఏమో ఐదు నెలలుగా గిరిజన గురుకులాలకు బిల్లులు నిలిపేశారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులపై వైసీపీ సర్కార్‌ శీతకన్ను వేసింది. ఒకప్పుడు విద్యార్థులకు ఇచ్చిన డైట్‌ చార్జీలతో డ్రైఫ్రూట్స్‌ సైతం వడ్డించిన గురుకులాలు.. ఇప్పుడు చాలీచాలని మెనూతో కునారిల్లుతున్నాయి. మూడేళ్లుగా డైట్‌ చార్జీలు పెంచకుండా నిలిపేసి విద్యార్థులను అర్ధాకలితో పెట్టిన సర్కార్‌.. ఇటీవల డైట్‌ చార్జీలు పెంచినా.. ధరలకు అనుగుణంగా లేకపోవడంతో పెరిగిన రేట్లతో మెనూను నిర్వహించలేక సతమతమవుతున్నాయి. ఒకప్పుడు దళిత, గిరిజన బిడ్డలకు కొసరి కొసరి వడ్డించే గురుకులాలు, ఇప్పుడు కొంచెం కొంచెం వడ్డిస్తున్నాయి. భోజనం తర్వాత తప్పనిసరిగా ఇస్తున్న అరటిపండు ఇప్పుడు చాలా గురుకులాల్లో మాయమైందంటున్నారు. అసలు గురుకులాల్లో ఏం జరుగుతోందో పట్టించుకునే వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో లేకపోవడంతో సంక్షేమ గురుకులాల్లో బిడ్డలు ఎవరికీ పట్టని వారుగా మిగిలిపోతున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 03:21 AM