ఆదాయం వ చ్చే దేవాలయాలే ప్రభుత్వానికి కావాలా.?
ABN , Publish Date - Dec 26 , 2023 | 02:57 AM
దేవాలయాలను పరిరక్షించే వారిని, దేవాలయాల విలువ తెలిసిన వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రముఖ కవి, అవధాని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కోరారు.
ఆలయాల విలువ తెలిసిన వారినే ఎన్నుకోండి
ఓటు గుడిలో వెలిగే జ్యోతి అంత పవిత్రం
త్వరలో ప్రాచీన దేవాలయాల స్థితిపై అధ్యయనం: జొన్నవిత్తుల
జగ్గయ్యపేట, డి సెంబరు 25: దేవాలయాలను పరిరక్షించే వారిని, దేవాలయాల విలువ తెలిసిన వారినే వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ప్రముఖ కవి, అవధాని జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కోరారు. ఆయన సోమవారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరీ కల్యాణ మండపంలో నిర్వహించిన 100 గుడుల బండారం కార్యక్రమం భక్త చైతన్య యాత్ర బృందానికి భగవద్రానుజగోష్టి నిర్వహించిన అభినందనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆదాయం లేని దేవాలయాలను అక్కర్లేదని చెబుతున్న ప్రభుత్వం, దేవదాయశాఖలు, ఆదాయం ఉన్న దేవాలయాలను చూస్తున్నాయని, ప్రాచీనత, సంస్కృతికి వారసత్వంగా ఉన్న దేవాలయాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. స్కంద, బ్రహ్మండ పురాణాల్లో పేర్కొన్న 100 ప్రాచీన దేవాలయాలను సందర్శించి, ప్రభుత్వానికి వాటి స్థితిపై నివేదించేందుకు, వాటి ప్రాభవాన్ని కల్పించాలని కోరే లక్ష్యంతో ఈ యాత్ర చేస్తున్నామని చెప్పారు. ఓటు గుడిలో జ్యోతి వంటిందని, దానిని శవం తల దగ్గర ఉంచే దీపాల్లా చేయవద్దని, ధర్మ రక్షణకు కట్టుబడి న, దేవాలయాల విలువ తెలిసిన వారు పాలకులుగా వస్తేనే హిందూ ధర్మం బాగుపడుతుందని చెప్పారు. ధర్మం తెలియని వారిని ఎన్నుకుంటే ఐదేళ్లపాటు ప్రజలు తిప్పలు పడాలని, జీవచ్చవాల్లా బతకాల్సి ఉంటుందన్నారు. హిందు ధర్మానికి విలువ ఇచ్చే ప్రభుత్వాలు ఉండటం వల్లనే కాశీ, అయోధ్య రామాలయ నిర్మాణం సాధ్యమైందన్నారు. హైకోర్టు న్యాయవాది ఈశ్వరప్రగడ హరిబాబు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, భగవద్గీతను ఎవరి ఇష్టానుసారం అన్వయించుకోవడమే దేశంలో, సమాజంలో నేటి దుస్థితికి కారణమన్నారు.