వినతి పత్రాలు ఇవ్వాలన్నా అడ్డుకుంటారా?
ABN , First Publish Date - 2023-09-22T03:55:48+05:30 IST
తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉన్నతాధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులపై పీఆర్ చాంబర్ నేతల ఆగ్రహం
అమరావతి, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఉన్నతాధికారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గురువారం ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్, కార్యదర్శి బిర్రు ప్రతా్‌పరెడ్డి, మరికొద్ది మంది కార్యవర్గ సభ్యులతో తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనరేట్‌కు వచ్చారు. ఈ సమాచారం ముందుగా తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో పంచాయతీరాజ్ కమిషనరేట్ కార్యాలయంకు చేరుకున్నారు. కమిషనరేట్ కార్యాలయం లోపలకు రానీయకుండా వారందరినీ బయటనే అడ్డుకున్నారు. దీంతో సర్పంచ్‌లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో పంచాయతీరాజ్ ప్రత్యేక కమిషనర్ డాక్టర్ ఎ.సిరి కార్యాలయం బయటకు వచ్చి పంచాయతీరాజ్ చాంబర్ నేతల నుంచి వినతిపత్రం స్వీకరించారు.