సచివాలయంలో కరపత్రాల పంపిణీ

ABN , First Publish Date - 2023-06-02T04:24:43+05:30 IST

రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, 11వ పీఆర్సీలోని అన్ని అంశాలు, సీపీఎస్‌ రద్దు, తమకు రావాల్సిన, ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక, ఆర్థికేతర

సచివాలయంలో కరపత్రాల పంపిణీ

ఉద్యోగుల వినూత్న నిరసన

అప్సా అధ్యక్షుడు

వెంకట్రామిరెడ్డికీ అందజేత

ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వినతి

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, 11వ పీఆర్సీలోని అన్ని అంశాలు, సీపీఎస్‌ రద్దు, తమకు రావాల్సిన, ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక, ఆర్థికేతర అంశాలన్నింటిపైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించి వచ్చేలా చేయాలని సచివాలయ ఉద్యోగుల సంఘం(అప్సా) అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించారు. అప్సా అధ్యక్షుడి తీరు ను తప్పుపడుతూ, మరోవైపు సచివాలయంలో గురువారం కరపత్రాలు పంపిణీ చేశారు. పరిష్కారం ఎప్పుడంటూ నిలదీశారు. సచివాలయంలోని ఐదు బ్లాకుల్లోని ఉద్యోగులకు, అసెంబ్లీలోని ఉద్యోగులకు కరపత్రాలు అందజేశారు. ‘కొత్త పీఆర్సీ వేసే సమయం వచ్చింది, నాలుగేళ్ల నుంచి రావాల్సిన ప్రయోజనాలు ఇవ్వలేదు, ఇప్పుడూ ప్రశ్నించకపోతే ఎలా? కరపత్రాల పంపిణీని స్వాగతిస్తున్నాం’ అంటూ పలువురు సంఘీభావం తెలిపారు.

Updated Date - 2023-06-02T04:24:43+05:30 IST