Share News

పార్టీని నమ్ముకుని నాశనమయ్యా

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:51 AM

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం కలిగొట్లకు చెందిన వైసీపీ కార్యకర్త దివ్యాంగుడైన దొడ్డిగర్ల భాస్కరరావు గత 13 ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తున్నాడు. భీమవరం విచ్చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చాడు.

పార్టీని నమ్ముకుని నాశనమయ్యా

దివ్యాంగుడైన వైసీపీ కార్యకర్త ఆవేదన

భీమవరం, డిసెంబరు 29(ఆంధ్ర జ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం కలిగొట్లకు చెందిన వైసీపీ కార్యకర్త దివ్యాంగుడైన దొడ్డిగర్ల భాస్కరరావు గత 13 ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తున్నాడు. భీమవరం విచ్చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసేందుకు వచ్చాడు. హెలీప్యాడ్‌ సమీపంలో సీఎంను కలవాలని అనుకున్నాడు. అయితే భాస్కరరావు ఏమైనా ఇబ్బంది పెడతాడేమోనని పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అతని కాలికి గాయమైంది. స్టేషన్‌లో భాస్కరరావు మాట్లాడుతూ ‘నేనేం తప్పు చేశాను. ఉద్యోగం కోసం జగన్‌ను కలిసేందుకు వెళుతుంటే స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇక జగన్‌ను కలవలేను. ఇక నాకు ఉద్యోగం రాదు. వైసీపీని నమ్ముకుని నాశనమైపోయా’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Updated Date - Dec 30 , 2023 | 02:51 AM