Share News

AP News: శ్రీశైలం ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2023-12-11T09:04:39+05:30 IST

కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను భక్తజనం ఆచరిస్తున్నారు.

AP News: శ్రీశైలం ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నంద్యాల: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను భక్తజనం ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. స్వామివారి అలంకార దర్శనం కోసం క్యూలైన్లో వేలాదిమంది భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శివనామ స్మరణతో మల్లన్న క్షేత్రం మారుమోగుతోంది.

Updated Date - 2023-12-11T09:04:40+05:30 IST