జగన్ మూర్ఖత్వమే పోలవరానికి శాపం: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2023-06-07T03:09:49+05:30 IST
జగన్‌రెడ్డి మూర్ఖత్వం, డబ్బు పిచ్చే పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి మూర్ఖత్వం, డబ్బు పిచ్చే పోలవరం నిర్మాణానికి శాపాలుగా మారాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 48 నెలల్లో రాష్ట్రంలో ఒక్క సాగు నీటి ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఒక్క ఎకరానికి నీళ్లవ్వని జగన్ తనకున్న 278 రోజుల్లో పోలవరం పూర్తి చేస్తాడా? అని ప్రశ్నించారు. తన హయాంలో సాగునీటి రంగానికి ఖర్చు చేసిందెంతో జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.