దళిత టీడీపీ కార్యకర్తపై సీఐ జులుం

ABN , First Publish Date - 2023-03-19T02:07:50+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న ఓ దళిత కార్యకర్తపై సీఐ చేయి చేసుకున్నారు.

దళిత టీడీపీ కార్యకర్తపై సీఐ జులుం

స్టేషన్‌ ఎదుట ఆందోళన.. చింతిస్తున్నట్టు సీఐ చెప్పడంతో విరమణ

అమలాపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న ఓ దళిత కార్యకర్తపై సీఐ చేయి చేసుకున్నారు. ఇందుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట రోడ్డుపై భైఠాయించి ఆందోళన చేశారు. చివరకు జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు సీఐ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. శనివారం బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ సంఘటన జరిగింది. అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, పార్టీ శ్రేణులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో ఒక వాహనంలో ఉన్న బాణసంచా జువ్వలు కాల్చేందుకు ప్రయత్నిస్తున్న దళిత కార్యకర్తపై పట్టణ సీఐ డి.దుర్గాశేఖర్‌రెడ్డి చేయి చేసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఆనందరావు, రమణబాబు, ఇతర నాయకులందరూ సీఐతో వాగ్వాదానికి దిగారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పట్టణ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట వర్షంలో సైతం ఆందోళన చేపట్టారు. సీఐ దుర్గాశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితులు చేజారిపోతుండడంతో టీడీపీ నాయకులను స్టేషన్‌ వద్దకు పిలిపించి జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు సీఐ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

Updated Date - 2023-03-19T02:07:50+05:30 IST