Share News

మోదీ పాలనలో సంక్షోభం: విజూ కృష్ణన్‌

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:56 AM

ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ అన్నారు.

మోదీ పాలనలో సంక్షోభం: విజూ కృష్ణన్‌

కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 17: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్‌ అన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ముగింపు సందర్భంగా కర్నూలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై సమావేశాల్లో చర్చించామన్నారు. స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రైతులను అన్ని విధాలుగా మోసం చేసిందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వంటి వాగ్దానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఆ తరువాత హామీలన్నింటినీ అటకెక్కించిందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, వాటికి తగిన గుణపాఠం చెపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్ల పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 02:56 AM