Share News

మంత్రి పెద్దిరెడ్డిపై క్రిమినల్‌ కేసు

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:14 AM

వైసీసీ సీనియర్‌ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

మంత్రి పెద్దిరెడ్డిపై క్రిమినల్‌ కేసు

గుంటూరు(లీగల్‌), డిసెంబరు 16: వైసీసీ సీనియర్‌ నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు. గుంటూరు జిల్లాలోని ఎక్సైజ్‌ కోర్టులో శుక్రవారం ఈ కేసు దాఖలు చేసినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. కోర్టు ఆదేశాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 1న ‘జగన్‌ పత్రిక’లో ‘నారాసురుడే ఇసుకాసురుడు’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ వార్తలో మాజీ మంత్రి నారా లోకేశ్‌పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ఆరోపణలను ప్రచురించారు. అయితే, ఈ ఆరోపణలు నిరాధారమని, వీటి కారణంగా తన కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని పేర్కొంటూ.. అప్పట్లోనే లోకేశ్‌ తన తరఫున సీనియర్‌ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు ద్వారా మంత్రికి లీగల్‌ నోటీసులు పంపించారు. సదరు నిరాధార నిందారోపణలకుగాను రూ.50 కోట్లు నష్ట పరిహారం చెల్లించడంతోపాటు, బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. నోటీసులపై పెద్దిరెడ్డి స్పందించకపోవడంతో ఎక్సైజ్‌ కోర్టులో లోకేశ్‌ క్రిమినల్‌ కేసు దాఖలు చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 05:14 AM