జగన్‌ది పిచ్చి పాలన
ABN , First Publish Date - 2023-09-26T04:48:12+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చి పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్

రాష్ట్ర పరిస్థితులపై రాష్ట్రపతి, గవర్నర్‌ను కలుస్తాం: రామకృష్ణ
అమరాతి(ఆంధ్రజ్యోతి), బాపట్లటౌన్, సెప్టెంబరు 25: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిచ్చి పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సోమవారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఆయన పిచ్చిరెడ్డిగా పేరు మార్చుకుంటే బాగుంటుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. సీఎం జగన్‌కు పరిపాలన చేతకాకపోతే.. రాష్ట్ర పాలనా పగ్గాలను డీజీపీకి అప్పస్తే సరి. హైదరాబాద్ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సొంత కార్లలో వస్తుంటే పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకుని బెదిరిస్తారా? ఇదేమన్నా ఇండియా-పాకిస్తాన్ బోర్డరా? ఈ ముఖ్యమంత్రికి అసలు విజ్ఞత ఉందా? అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు.. చలో అసెంబ్లీకి పిలుపునివ్వడం సహజం. ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించలేని కాలం.. అమృతకాలం ఎలా అవుతుంది? ఇదేనా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే అమృతోత్సవ్, అచ్ఛేదిన్? రాష్ట్రంలో విపత్కర పరిస్థితులను సృష్టిస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్రమోదీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రపతి, గవర్నర్‌లను కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల గురించి వివరిస్తాం’’ అని రామకృష్ణ తెలిపారు.
ఉద్యమాల అణచివేతే లక్ష్యం: నారాయణ
బాపట్ల వేదికగా సోమవారం ప్రారంభమైన ఏపీ వ్యవసాయ కార్మికసంఘ 22వ మహాసభల్లో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ... ఉద్యమాలను అణిచివేయటమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని, ఇష్టానుసారంగా ప్రభుత్వాలు చట్టాలను మార్చడమన్యాయమని అన్నారు.
పోలీసులతో వైసీపీ పాలన: మధు
తిరుపతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అధికార వైసీపీ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తోందని సీపీఎం నేత, మాజీ ఎంపీ మధు విమర్శించారు. అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మధు మాట్లాడుతూ, అక్రమ అరెస్టులు.. కార్మికుల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.