Share News

దిగ్ర్భాంతి కలిగించింది

ABN , First Publish Date - 2023-10-30T02:22:40+05:30 IST

విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాద ఘటనపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

దిగ్ర్భాంతి కలిగించింది

రైలు ప్రమాద ఘటనపై గవర్నర్‌ నజీర్‌, సీఎం జగన్‌ ప్రకటన

మృతుల కుటుంబాలకు రాష్ట్రం 10, కేంద్రం 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

దురదృష్టకరం: పవన్‌, లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాద ఘటనపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన ప్రయాణికుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సాయం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద స్థలిలో అవసరమైన సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జనసేన నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన వారిలో రాష్ట్రానికి చెందిన వారికి రూ.10 లక్షల చొప్పున, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపింది. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన రాష్ట్రానికి చెందిన వారికి రూ.2 లక్షలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

Updated Date - 2023-10-30T02:22:40+05:30 IST