అమలులోకిపాల సేకరణ చట్టం–2023

ABN , First Publish Date - 2023-06-02T04:30:22+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పాల సేకరణ (రైతుల రక్షణ), పాల భద్రతా ప్రమాణాల చట్టం–2023 జూన్‌ 1 నుంచి అమలులోకి తెస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అమలులోకిపాల సేకరణ చట్టం–2023

అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పాల సేకరణ (రైతుల రక్షణ), పాల భద్రతా ప్రమాణాల చట్టం–2023 జూన్‌ 1 నుంచి అమలులోకి తెస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ చట్టం అమలుకు రాష్ట్ర పశుసంవర్ధకఽశాఖ డైరెక్టర్‌ను మిల్క్‌ కమిషనర్‌గా నియమించింది. పాల ఉత్పత్తిలో నాణ్యత ప్రమాణాల తనిఖీకి క్షేత్రస్థాయిలో ఇన్‌స్పెక్టర్లను నియమించనున్నారు. జిల్లా స్థాయిలో పశుసంవర్థకశాఖ అధికారి అధీకృత అధికారిగా ఉంటారు. పాల సేకరణ, విక్రయ కేంద్రాలకు లైసెన్సుల జారీ, పాల నాణ్యత నిర్వహణలో లోపాలుంటే లైసెన్సుల సస్పెన్షన్‌ అధికారం కలిగి ఉంటారు.

Updated Date - 2023-06-02T04:30:22+05:30 IST