Share News

Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:00 PM

‘ఆడుదాం ఆంధ్రా’ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్రా క్రీడలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఊరిలో జరిగే ఈ క్రీడలతో వ్యాయామం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంత అవసరమో తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు.

Jagan: ‘ఆడుదాం ఆంధ్రా’ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుంది

గుంటూరు: ‘ఆడుదాం ఆంధ్రా’ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదాం ఆంధ్రా క్రీడలు జరుగుతున్నాయన్నారు. ప్రతి ఊరిలో జరిగే ఈ క్రీడలతో వ్యాయామం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంత అవసరమో తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వలన బీపీ, షుగర్‌లు కంట్రోలు అవుతాయన్నారు.

దేశం మొత్తం గర్వపడే విధంగా విలేజ్ క్లినిక్‌లో ద్వారా అరోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉండాలన్నా, రాకుండా జాగ్రత్త పడాలన్నా క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని జగన్ పేర్కొన్నారు. సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు జరుగుతాయన్నారు. గ్రామ స్థాయిలో ఉండే ఆణిముత్యాలను వెలికి తీసి వారికి సానపెట్టి జాతీయ స్థాయికి తీసుకెళ్ళడం మరొక ఉద్దేశమని జగన్ తెలిపారు. ఇందులో ప్రముఖ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్ ఆడుదాం ఆంధ్రాలో భాగస్వామ్యులవుతున్నామన్నారు.

గ్రామ స్థాయి క్రీడాకారులను తీర్చి దిద్దటంలో వీరు సహాయ పడతారన్నారు. ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతిఏటా జరగడం వలన ఆరోగ్యంపై అవగాహన, టాలెంట్ హంట్ జరుగుతోందన్నారు. దీనికి 1,22,85,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నా క్రీడా ప్రాంగణాలను గుర్తించామని.. వాటిని శరవేగంగా అభివృద్ధి చేస్తామని జగన్ పేర్కొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:00 PM