Share News

Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్..

ABN , Publish Date - Dec 30 , 2023 | 07:50 AM

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉదయం 9.30 గంటలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో కురభ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

 Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన షెడ్యూల్..

చిత్తూరు: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ఉదయం 9.30 గంటలకు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో కురభ భవనం వద్ద శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కురభ కులస్థులతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 2.30 కి కుప్పం బస్టాండ్‌లోని అన్నా కాంటీన్‌లో పేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం మసీద్‌కు పెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు మాల్లనూరు బస్టాండ్ వద్దకి చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరు HAL ఎయిర్‌పోర్టుకి చేరుకొని హైదరాబాద్‌కు వెళతారు.

Updated Date - Dec 30 , 2023 | 07:50 AM