పోలవరం ప్రాజెక్టులో కేంద్ర బృందాల పర్యటన

ABN , First Publish Date - 2023-03-05T03:51:53+05:30 IST

ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని కేంద్ర నిపుణుల బృందాలు శనివారం పరిశీలించాయి.

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర బృందాల పర్యటన

పోలవరం, మార్చి 4: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని కేంద్ర నిపుణుల బృందాలు శనివారం పరిశీలించాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ), సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌), డ్యాం డిజైనింగ్‌ రివ్యూ ప్యానెల్‌ (డీడీఆర్‌పీ), కాంక్రీట్‌ అండ్‌ మెటీరియల్‌ డిజైన్స్‌ డైరెక్టరేట్‌ (సీఎండీడీ) సభ్యులు ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో పలు ప్రాంతాలను పరిశీలించారు. కాగా.. ప్రాజెక్టు సందర్శనకు శనివారం ఉదయం రావాల్సిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాయంత్రానికి చేరుకున్నారు. ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేశారు.

Updated Date - 2023-03-05T03:51:53+05:30 IST