బొకెలు వద్దు మొక్కలతో వేడుకలు
ABN , Publish Date - Dec 31 , 2023 | 12:18 AM
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా జనవిజ్ఞానవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించిన జనవరి ఒకటి వేడుకలు ‘బొకెలతో కాకుండా మొక్కలతో,పుస్తకాలతో చేసుకుందాం’ అనే పోస్టర్లను కలెక్టర్ మనిజీర్‌జిలానీ సమూన్, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి డీఆర్వో పుల్లయ్య విడుదల చేశారు.
నంద్యాల (కల్చరల్), డిసెంబర్ 30: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా జనవిజ్ఞానవేదిక సంయుక్త ఆధ్వర్యంలో ముద్రించిన జనవరి ఒకటి వేడుకలు ‘బొకెలతో కాకుండా మొక్కలతో,పుస్తకాలతో చేసుకుందాం’ అనే పోస్టర్లను కలెక్టర్ మనిజీర్‌జిలానీ సమూన్, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి డీఆర్వో పుల్లయ్య విడుదల చేశారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ దస్తగిరి, జిల్లా వైస్‌చైర్మన్ మారుతీకుమార్, కోశాధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ సేవలకు ల్యాప్టాప్‌లు: ప్రజాసమస్యలు పరిష్కరించడంలో తహసీల్దార్‌లు కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి సేవలు మరింత విస్తృతపరిచేందుకు ల్యాప్టాప్‌లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ మనజీర్‌జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారుల సేవలను గుర్తించి నూతన సంవత్సర కానుకగా అన్ని మండలాల తహసీల్దార్‌లకు కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి , డీఆర్‌ఓ పుల్లయ్యలకు ల్యాప్టాప్‌లు పంపిణీ చేశారు.