‘ఒంటిమిట్ట’లో బైరెడ్డి హల్‌చల్‌

ABN , First Publish Date - 2023-01-26T03:42:26+05:30 IST

శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో హల్‌చల్‌ చేశారు.

‘ఒంటిమిట్ట’లో బైరెడ్డి హల్‌చల్‌

వందలాది అనుచరులతో ఆలయ ప్రవేశం

జై జగన్‌, జై బైరెడ్డి నినాదాలు.. భక్తులకు ఇబ్బందులు

ఒంటిమిట్ట, జనవరి 25: శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో హల్‌చల్‌ చేశారు. బుధవారం కోదండరాముడిని దర్శించుకునేందుకు ఆయన పెద్దఎత్తున అనుచరులతో వచ్చారు. ఆలయానికి సమీపంలోని ఓ హోటల్‌ నుంచి దాదాపు 300 మంది అనుచరులతో ర్యాలీగా ఆలయానికి వచ్చారు. మీడియా ప్రతినిధులను, టీటీడీ అధికారులను తోసుకుంటూ అంతరాలయంలోకి ప్రవేశించారు. జై జగన్‌, జై బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అంటూ అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలతో ఆలయంలో హోరెత్తించారు. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. టీటీడీ విజిలెన్స్‌ అధికారులు వీరిని అడ్డుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. బైరెడ్డికి టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2023-01-26T03:42:26+05:30 IST