తిరుగుబాటు చేసే వరకు తెచ్చారు: నీలాయపాలెం
ABN , Publish Date - Dec 14 , 2023 | 02:58 AM
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో పోటు బ్రాహ్మణులు తిరుగుబాటు చేసేవరకూ పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు.
అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో పోటు బ్రాహ్మణులు తిరుగుబాటు చేసేవరకూ పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం దిగజార్చిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు. ‘శ్రీవారి లడ్డూ తయారీలో తాత్కాలిక పద్ధతిని పనిచేసే పోటు బ్రాహ్మణులను శ్రమను దోచుకుంటోంది చాలక అక్కడి పేష్కార్, ఏఈవోలు వారిని సంస్కృత బూతులు తిట్టడంతో పోటు బ్రాహ్మణులంతా కలిసి తిరుగుబాటు చేసి మంగళవారం లడ్డూ తయారీని నిలిపివేశారు. అక్కడ దిగజారిన పరిస్ధితులు, వారి పట్ల టీటీడీ అనుసరిస్తున్న క్రూర విధానాలు దీనికి కారణం. తక్షణమే పోటు బ్రాహ్మణుల సమస్యలను టీటీడీ పాలకమండలి పరిష్కరించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.