నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-02-11T02:57:10+05:30 IST

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

నంద్యాల/శ్రీశైలం (ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 10: శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 11 రోజులపాటు స్వామి అమ్మవార్లకు వివిధ సేవలు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరి పూజ చేస్తారు. తర్వాతి రోజు నుంచి స్వామి అమ్మవార్లకు రోజుకో వాహన సేవ నిర్వహిస్తారు. మహా శివరాత్రి రోజున సాయంత్రం స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇదే సమయంలో స్వామివారికి పాగాలంకరణ కార్యక్రమం ఉంటుంది. లింగోద్భవ కార్యక్రమం అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహిస్తారు.

Updated Date - 2023-02-11T02:57:10+05:30 IST