జగనన్న కాలనీలకు భారతీ సిమెంటా: అయ్యన్న
ABN , First Publish Date - 2023-08-02T04:05:00+05:30 IST
రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కాలనీలకు జగనన్న కాలనీలని పేరు పెట్టుకోవడంతోపాటు కేవలం భారతీ సిమెంట్‌నే వాడాలన్న నిబంధనలు ఎందుకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి
అనపర్తి, ఆగస్టు 1: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కాలనీలకు జగనన్న కాలనీలని పేరు పెట్టుకోవడంతోపాటు కేవలం భారతీ సిమెంట్‌నే వాడాలన్న నిబంధనలు ఎందుకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా మంగళవారం రామ వరంలో ఆయన విగ్రహానికి అయ్యన్నపాత్రుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు.