ప్రాధాన్య క్రమంలోనే ఉద్యోగులకు ప్రయోజనాలు
ABN , First Publish Date - 2023-06-07T03:38:58+05:30 IST
ఉద్యోగులకు చేకూర్చాల్సిన ప్రయోజనాలను ఉద్యోగ సంఘాల ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇస్తోందన్న వాదన సరికాదని, ప్రాధాన్యత...
● ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులకు చేకూర్చాల్సిన ప్రయోజనాలను ఉద్యోగ సంఘాల ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇస్తోందన్న వాదన సరికాదని, ప్రాధాన్యత క్రమంలోనే నిధులు విడుదల చేస్తోందని ప్రభుత్వ సలహదారుడు(ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నందున ఉద్యోగ సంఘాల ఆందోళనలు ఇక కొనసాగవని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.