ముందస్తంటే.. జగనకు భయమెందుకు?: వర్ల
ABN , First Publish Date - 2023-06-07T04:15:15+05:30 IST
ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.
అమరావతి, జూన 6(ఆంధ్రజ్యోతి): ముందస్తు ఎన్నికలకు వైసీపీ ఎందుకు భయపడుతోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం.. భయపడి, తోకముడిచినట్లు కాదా? అని నిలదీశారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వై నాట్ 175 అన్న జగన ప్రగల్భా లు ఏమయ్యాయి? కుప్పం కొడతామన్న డాంబికాలు ఏమయ్యాయి?. జగన ఎందుకు బీద పలుకులు పలుకుతున్నాడు?’ అని ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం లేదని గ్రహించే, ఒక్కరోజు అధికారాన్ని కూడా వదులుకోమని ముఖ్యమంత్రి లాంటి పెద్దిరెడ్డి అంటున్నారని వ్యాఖ్యానించారు.