చదువుకున్న వర్సిటీలోనే అధ్యాపకుడిగా..!

ABN , First Publish Date - 2023-06-02T04:51:17+05:30 IST

అమెరికాలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక క్లార్క్‌ యూనివర్సిటీ అధ్యాపకుడి(స్కూల్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఫర్‌ డిజిటల్‌

చదువుకున్న వర్సిటీలోనే అధ్యాపకుడిగా..!

● అమెరికాలో మెరిసిన తెలుగు తేజం పేరం వెంకట్‌తేజ

పెళ్లకూరు, జూన్‌ 1: అమెరికాలో 150 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక క్లార్క్‌ యూనివర్సిటీ అధ్యాపకుడి(స్కూల్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌)గా తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు గ్రామానికి చెందిన పేరం వెంకటతేజ ఎంపికయ్యారు. ఈ వర్సిటీలో ప్రొఫెసర్‌గా నియమితులైన తొలి భారతీయుడిగానూ రికార్డు నమోదు చేశారు. పేరం మధుసూదన్‌నాయుడు, జ్యోతి దంపతుల కుమారుడైన వెంకట్‌తేజ ఒకటి నుంచి పదో తరగతి వరకు కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీవిశ్వశాంతి హైస్కూల్‌లో చదువుకున్నారు. నెల్లూరు నారాయణ కాలేజీలో ఇంటర్‌, బెంగళూరు సెయింట్‌ జోషప్స్‌ కాలేజీలో బీసీఏ పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి క్లార్క్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ కోర్సు అభ్యసిస్తూ స్టూడెంట్‌ అంబాసిడర్‌గా పనిచేశారు. అనంతరం అమెరికాలోని ఓ ఐటీ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న వెంకట్‌తేజ సేవలను గుర్తించిన క్లార్క్‌ యూనివర్సిటీ ఆయనకు ఈ అవకాశం కల్పించింది. దీంతో వెంకటతేజను అక్కడి తెలుగు విద్యార్థులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.


Updated Date - 2023-06-02T04:51:17+05:30 IST