అపాయింట్‌మెంట్‌ ప్లీజ్‌!

ABN , First Publish Date - 2023-08-25T02:56:24+05:30 IST

ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కలిసేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నట్లు తెలిసింది. వారిద్దరినీ కలిసేందుకు గతవారమే ఆయన ప్రయత్నాలు చేశారని.. కానీ

అపాయింట్‌మెంట్‌ ప్లీజ్‌!

మోదీ, షా సమయం కోరుతున్న జగన్‌.. హోంమంత్రి టైమిస్తే రేపు ఢిల్లీకి

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను కలిసేందుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోరుతున్నట్లు తెలిసింది. వారిద్దరినీ కలిసేందుకు గతవారమే ఆయన ప్రయత్నాలు చేశారని.. కానీ సానుకూల సంకేతాలు రాలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారని.. సోమవారంనాటికి ఢిల్లీ వస్తారని తెలిపాయి. ఈలోగా అమిత్‌షా నుంచి పిలుపు వస్తే జగన్‌ శనివారం ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. లేదంటే వచ్చేవారం కలిసే ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన కోరగానే వీరిద్దరూ అపాయింట్‌మెంట్‌ ఇస్తున్నారని.. గత వారం మాత్రం ఎందుకు ఇవ్వలేదోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Updated Date - 2023-08-25T02:56:24+05:30 IST