కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ABN , First Publish Date - 2023-06-01T05:40:17+05:30 IST

కసూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష కార్యాలయం తెలిపింది.

కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

● 1,358 పోస్టులకు నోటిఫికేషన్‌..

5 వరకూ దరఖాస్తుల స్వీకరణ

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): కసూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష కార్యాలయం తెలిపింది. మొత్తం 1,358 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయిందని, జూన్‌ 5 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని పేర్కొంది. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఒకే దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని, అయితే ప్రతి పోస్టుకు రూ.వంద చొప్పున రుసుము వేర్వేరుగా చెల్లించాలని స్పష్టంచేసింది. మరిన్ని వివరాల కోసం 9441270099 నంబరుకు కాల్‌ చేయాలని పేర్కొంది.

Updated Date - 2023-06-01T05:40:17+05:30 IST