Share News

ఏపీసీసీ ఇన్‌చార్జిగా మాణిక్కం ఠాగోర్‌

ABN , Publish Date - Dec 24 , 2023 | 03:05 AM

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(ఏపీసీసీ) ఇన్‌చార్జీగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్కం ఠాగోర్‌ని నియమించారు. ఆమేరకు

ఏపీసీసీ ఇన్‌చార్జిగా మాణిక్కం ఠాగోర్‌

అమరావతి, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(ఏపీసీసీ) ఇన్‌చార్జీగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మాణిక్కం ఠాగోర్‌ని నియమించారు. ఆమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించడంలో మాణిక్కం ఠాగోర్‌ కీలకపాత్రను పోషించారు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించాక.. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అలుపెరగని పోరాటం చేశారు. నిరంతరం.. పాలకపక్షాన్ని ఢీ కొడుతూ పార్టీలో జవసత్వాలను నింపారు. మాణిక్కం ఠాగోర్‌ రాకతో రాష్ట్రంలోనూ ఏపీసీసీకి నూతన జవసత్వాలు వస్తాయన్న ఆశాభావాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Dec 24 , 2023 | 03:05 AM