షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలిస్తే జగన్‌ పని అయిపోయినట్టే: ఆదినారాయణరెడ్డి

ABN , First Publish Date - 2023-06-26T03:45:50+05:30 IST

షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలిస్తే జగన్‌ పని అయిపోయినట్టే: ఆదినారాయణరెడ్డి

షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలిస్తే జగన్‌ పని అయిపోయినట్టే: ఆదినారాయణరెడ్డి

కడప, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడం ఖాయం. మా దగ్గర పక్కా సమాచారం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ఏపీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తే జగన్‌ పని అయిపోయినట్టే’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కడపలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ షర్మిలను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుని జగన్‌కు చెక్‌ పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్రానికి వచ్చి నాన్న వైఎస్‌ పాలన వేరు, జగన్‌ పాలన వేరు అని చెపితే చాలు. ఆ ఒక్క మాటతో జగన్‌ పని అయిపోయినట్టే. ఇదే జరుగుతుంది. ఆ మేరకు కచ్చితమైన సమాచారం మాకు ఉంది’’ అని ఆదినారాయణరెడ్డి అన్నారు.

Updated Date - 2023-06-26T03:45:50+05:30 IST