27న మాలల ఆత్మీయ సమావేశం

ABN , First Publish Date - 2023-06-26T03:44:11+05:30 IST

మాలల ఆత్మీయ సమావేశం ఈనెల 27న ఉదయం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగుతుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు.

27న మాలల ఆత్మీయ సమావేశం

మాలల ఆత్మీయ సమావేశం ఈనెల 27న ఉదయం మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో జరుగుతుందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తెలిపారు. అన్ని సామాజిక వర్గాల్లో సాధికారత కోసం టీడీపీ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల జరిపిన మాదిగల ఆత్మీయ సమావేశానికి కొనసాగింపుగా ఇప్పుడు మాలల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-06-26T03:44:11+05:30 IST