కంతేరు వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు పెట్టాలి

ABN , First Publish Date - 2023-06-26T03:55:22+05:30 IST

కంతేరు వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు పెట్టాలి

కంతేరు వైసీపీ నేతపై అట్రాసిటీ కేసు పెట్టాలి

డీజీపీకి వర్ల రామయ్య లేఖ

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా కంతేరు దళితులపై దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడైన వైసీపీ యువజన విభాగం నాయకుడ కళ్లం హరికృష్ణారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం డీజీపీకి ఆయన లేఖ రాశారు. ‘కంతేరులో శామ్యూల్‌ అనే దళిత యువకుడిపై అత్యంత దారుణంగా దాడి చేసి, గాయపర్చినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కొంత మంది పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కళ్లం హరికృష్ణారెడ్డి, అతని అనుచరులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, మర్డర్‌ కేసు నమోదు చేసేలా సంబంధిత పోలీసులను ఆదేశించాలి. దళితులపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని’ డీజీపీని కోరారు.

Updated Date - 2023-06-26T03:55:22+05:30 IST