రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదు: సినీ నటుడు సుమన్‌

ABN , First Publish Date - 2023-06-26T03:57:19+05:30 IST

రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదు: సినీ నటుడు సుమన్‌

రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదు: సినీ నటుడు సుమన్‌

పెదకాకాని, జూన్‌ 25: రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేదని సినీ నటుడు సుమన్‌ అన్నారు.. ఆదివారం గుంటూరు జిల్లా పెదకాకానిలో జరిగిన సర్దార్‌ లచ్చన్న విగ్రహావిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్‌ మాట్లాడుతూ బీసీలకు లబ్ధి చేకూరేలా మేనిఫెస్టో రూపొందించిన పార్టీకే ఈసారి మద్దతు ఇవ్వాలని సూచించారు. కర్ణాటకలో బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ సీట్లు కేటాయించిందని, అందుకే అక్కడ ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తెలిపారు. బాపట్ల జిల్లా ఉప్పల వారిపాలెంలో అమర్నాథ్‌ గౌడ్‌ హత్యపై ఇప్పటివరకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం సైలెంట్‌ గా ఉంటూనే సమయం వచ్చినప్పుడు వైలెంట్‌ గా మారాలని సుమన్‌ పిలుపునిచ్చారు. మనకు మేలు చేసే పార్టీ వద్దకు మాత్రమే వెళ్లాలని అని తెలిపారు.

Updated Date - 2023-06-26T03:57:19+05:30 IST