‘జగన్’ను ఛీకొడుతున్నారు
ABN , First Publish Date - 2023-06-26T03:04:45+05:30 IST
యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన ఈ 137 రోజుల వ్యవధి లో జగన్ అరడజను కార్యక్రమాలు ప్రకటించారని, ..
వంద పథకాలు రద్దు చేసిన ఏకైక సీఎం
చంద్రబాబులా చేయాలంటే నాలుగు జన్మలెత్తాలి
యువగళం పాదయాత్రలో లోకేశ్
తిరుపతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన ఈ 137 రోజుల వ్యవధి లో జగన్ అరడజను కార్యక్రమాలు ప్రకటించారని, అయితే వాటన్నింటినీ ప్రజలు ఛీ కొడుతున్నారని టీడీ పీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశా రు. యువగళం పాదయాత్ర 137వ రోజైన ఆదివారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలో పర్యటించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ తన పాదయాత్రతో జగన్‌లో భయం మొదలైందని, అర డజను కార్యక్రమాలు ప్రకటించినా ఒక్కటీ సక్సెస్ కాలేదన్నారు. ‘మా నమ్మకం నువ్వే అనే కార్యక్రమాన్ని జగన్ ప్రకటిస్తే.. తల్లి, చెల్లి నమ్మని వాడిని మేమెలా నమ్ముతామంటూ ప్రజలు ఛీ కొట్టారు. వెంటనే స్కీమ్ మార్చి మా భవిష్యత్తు నువ్వే అంటూ ఇంటింటికీ స్టిక్కర్లు అతికించాడు. నాలుగేళ్లుగా పీకింది ఏమీ లేదని.. ఆ స్టిక్కర్లను ప్రజ లు పీకి డ్రైనేజీలో పడేశారు. తర్వాత జగన్‌కు చెబు దాం అని కొత్త కార్యక్రమం ప్రకటించగా నాలుగేళ్లుగా చెప్పిచెప్పి అలసిపోయాం ఇక చెప్పేది ఏమీ లేదంటూ జనాలు చెప్పులు చూపించారు. ఆపై గడపగడపకు ప్రభుత్వం అన్నాడు. గడపకు వెళ్లిన ఎమ్మెల్యేలు జగన్‌ను జనాలు తిట్టే తిట్లు వినలేక పారిపోయారు. ఇపుడు సురక్ష కార్యక్రమం మొదలు పెట్టాడు. 99 శాతం హామీలు నెరవేర్చాను, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయని బిల్డప్ ఇస్తున్నాడు. నాలుగేళ్లు కాలక్షేపం చేసి, ఇపుడు కొత్తగా లబ్ధిదారులను గుర్తిస్తామనడం మోసం కాదా?’ అని లోకేశ్ ప్రశ్నించారు. వంద సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక సీఎం జగనే అని లోకేశ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక జగన్ 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడని, మైనారిటీలకు దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనం తదితర పథకాలు రద్దు చేశాడని తెలిపారు. జగన్ పాలనలో ఆత్మహత్యల్లో నెంబరు 3గా, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నెంబరు 2గా రాష్ట్రం పేరు తెచ్చుకుంటోందని విమర్శించారు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచాడని, అర్థంపర్థం లేని పేర్లు పెట్టి ప్రజల్ని దోచేస్తున్నాడని ఆరోపించారు. దేశంలో పెట్రోలు, డీజిల్ ధరల్లో ఏపీ నెంబరు-1గా ఉందన్నారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసీపీ నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడని, డాక్టర్ సుధాకర్ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మ ణ్యం వరకూ దళితుల్ని ఎలా చంపారో ప్రజలు చూశారన్నారు.
నెల్లూరుకు బాబులా చేయాలంటే..?
2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీకి మూడు సీట్లే వచ్చాయని, అయినా టీడీపీ ప్రభుత్వం జిల్లాను అభివృద్ధి చేసిందని లోకేశ్ చెప్పారు. ఒక్క నెల్లూరు నగర అభివృద్ధికే రూ.4,500 కోట్లు ఖర్చు చేశామని, ఇది నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం నెల్లూరులో రూ.వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తే, ఈ నాలుగేళ్లలో రూ.100 కోట్లు కూడా ఖర్చు చేసి పూర్తి చేయలేని వేస్ట్ ప్రభుత్వమిదని విమర్శించారు. నెల్లూరుకు చంద్రబాబు చేసింది జగన్ చేయాలంటే నాలుగు జన్మలు ఎత్తాల్సి ఉంటుందని, చంద్రబాబుది పోలవరం రేంజ్ అయితే జగన్‌ది పిల్లకాలువ రేంజ్ అన్నారు. జగన్ పాలన గురించి రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ‘2019 ఎన్నికల్లో ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్‌ను గెలిపించుకున్నారు. ఇప్పు డు మీకు జగన్ ప్రభుత్వంలో కనీస గౌరవముందా?’ అని లోకేశ్ ప్రశ్నించారు. అప్పుడైనా, ఇప్పుడైనా అన్ని వర్గాలకూ సమాన గౌరవం ఇచ్చింది టీడీపీ ఒక్కటేనని తేల్చి చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాతలకు ఏడాదికి రూ.20వేల సాయం చేస్తామన్నారు.