‘నన్నయ’లో నైనా జైస్వాల్‌ పీహెచ్‌డీ

ABN , First Publish Date - 2023-04-21T03:20:05+05:30 IST

అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ పీహెచ్‌డీ పూర్తిచేశారు.

‘నన్నయ’లో నైనా జైస్వాల్‌ పీహెచ్‌డీ

పట్టా అందజేసిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

దివాన్‌చెరువు, ఏప్రిల్‌ 20: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ పీహెచ్‌డీ పూర్తిచేశారు. రాష్ట్ర గవర్నర్‌, నన్నయ విశ్వవిద్యాలయం చాన్సలర్‌ అబ్దుల్‌ నజీర్‌ గురువారం ఆమెకు పీహెచ్‌డీ పట్టా అందజేసి అభినందించారు. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. వర్సిటీ పూర్వ ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు ఆమెకు పీహెచ్‌డీకి గైడ్‌గా ఉండి మార్గనిర్దేశం చేశారు. కాగా.. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారికతలో మైక్రోఫైనాన్స్‌ పాత్రపై అధ్యయనం’ అంశంపై విజయవంతంగా పరిశోధన పూర్తిచేశానని నైనా జైస్వాల్‌ తెలిపారు.

Updated Date - 2023-04-21T03:20:05+05:30 IST