జగన్‌ అక్రమాల చిట్టా బయటపెడతాం

ABN , First Publish Date - 2023-05-26T03:36:16+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఫైల్స్‌ను త్వరలో బయట పెట్టబోతున్నామని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

జగన్‌ అక్రమాల చిట్టా బయటపెడతాం

మంత్రులు, వైసీపీ నేతల అవినీతి వెల్లడిస్తాం

రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది

సీబీఐని అడ్డుకోవడం సరికాదు: బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి

న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ ఫైల్స్‌ను త్వరలో బయట పెట్టబోతున్నామని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి తెలిపారు. జగన్‌తోపాటు.. ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై తాము బయటపెట్టే ఫైల్స్‌ సంచలనం సృష్టిస్తాయని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో భానుప్రకాశ్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, అవినాశ్‌ రెడ్డి కోసం వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. సీబీఐ స్వతంత్రంగా పనిచేస్తున్నదని, ఎవర్నీ వదిలిపెట్టదని చెప్పారు. ఏపీలో కొందరు పోలీసులు ఐపీఎ్‌సను ఇండియన్‌ పొలిటికల్‌ సర్వీ్‌సగా మార్చారని, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సెక్షన్లు పని చేస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి జగన్‌ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జగన్‌ బీజేపీకి ప్రత్యర్థే కాని శత్రువు కాదని చెప్పారు.

Updated Date - 2023-05-26T03:36:16+05:30 IST