నూతన పార్లమెంటు ప్రారంభం దేశానికి గర్వకారణం

ABN , First Publish Date - 2023-05-26T04:03:01+05:30 IST

పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

నూతన పార్లమెంటు ప్రారంభం దేశానికి గర్వకారణం

ప్రధాని మోదీకి చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ట్వీట్‌ చేశారు. ‘‘ఇది దేశానికి ఆనందకరం... గర్వ కారణం అయిన సందర్భం. ఈ చారిత్రాత్మక నిర్మాణం జరిపిన ప్రధానికి, కేంద్ర ప్రభుత్వ్చానికి, ఇందులో భాగస్వామ్యం తీసుకొన్న ప్రతి ఒక్కరికి మా శుభాకాంక్షలు. దేశాన్ని సమూలంగా మార్చగలిగే విధాన నిర్ణయాలకు కొత్త పార్లమెంటు భవనం వేదిక కావాలని మా అభిలాష. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుంది. ఆ నాటికి దేశంలో పేదరికం రూపుమాసి... ఉన్నవారికి, లేని వారికి మధ్య అంతరాలు తొలగిపోయే మంచి కాలానికి కొత్త భవనం నాం దీవాచకం పలకాలని ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు. ఈ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకొంది. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ హాజరు కానున్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తినంత పెద్ద అంశం ఇది కాదని, అందుకే టీడీపీ హాజరవుతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2023-05-26T04:03:01+05:30 IST