జగన్ ముద్దు.. కిరణ్ వద్దు!
ABN , First Publish Date - 2023-06-26T03:15:44+05:30 IST
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు.
ఎచ్చెర్ల ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు
లావేరు, జూన్ 25: శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేశారు. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు లావేరు మండలం పెదలింగాలవలసలో ఆదివారం భారీ సభ ఏర్పాటు చేశారు. కిరణ్‌కుమార్ గెలుపునకు తాము ఎంతో కృషి చేశామని, గెలిచాక తమను పక్కనపెట్టారని పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరి సభను లావేరు పోలీసులు అడ్డుకున్నారు. లావేరు మండల నాయకులు వట్టి సత్యనారాయణ, గొర్లె రామినాయుడు, శివంగం నాగరాజు, లుకలాపు సూర్యనారాయణ, తేనెల సురేష్ కుమార్, మీసాల జగన్, పి.రమణను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సాయంత్రం వరకు ఉంచారు.