ఎమ్మెల్యే కిలివేటికి బుద్ధి చెబుతాం
ABN , First Publish Date - 2023-06-26T03:14:43+05:30 IST
ఎమ్మెల్యే కిలివేటికి బుద్ధి చెబుతాం
తడలో టీడీపీ మత్స్యకార నేతల ఆందోళన
తడ, జూన్ 25: మత్స్యకారులపై చులకనగా మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని టీడీపీ మత్స్యకార నాయకులు వైసీపీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను హెచ్చరించారు. ఆదివారం తడ బజారు కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్ మాట్లాడుతూ.. మత్స్యకారులను కుక్కలంటూ ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గు చేటన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మత్స్యకారులు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే కిలివేటికి ఇకనుంచి దూరంగా ఉండాలని.. ఆయన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని బీవీపాళెం పంచాయతీ వైసీపీ నాయకులు, గ్రామస్థులు తీర్మానం చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో సమావేశమయ్యారు. గ్రామానికి వచ్చినా ఆయన కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, నిశ్చయించుకున్నట్లు బీవీపాళెం గ్రామస్థులు తెలిపారు.