AP News: వేరువేరుగా పడివున్న తల- మొండం- కాళ్ళు

ABN , First Publish Date - 2023-01-15T19:13:12+05:30 IST

జిల్లాలోని ఎలమంచిలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణహత్యకు పాల్పడ్డారు.

AP News: వేరువేరుగా పడివున్న తల- మొండం- కాళ్ళు

అనకాపల్లి: జిల్లాలోని ఎలమంచిలిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణహత్యకు పాల్పడ్డారు. కొత్తపాలెంలో బ్రిడ్జి కింద కాలువలో మృతదేహం లభ్యమయింది. కాలువలో పడి ఉన్న తల, మొండెం, కాళ్లు వేరువేరుగా పడివుండటంతో స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2023-01-15T19:13:14+05:30 IST