కాపు మంత్రులు నోటికి తాళాలేసుకున్నారా?: అనగాని
ABN , First Publish Date - 2023-06-26T03:56:21+05:30 IST
కాపు మంత్రులు నోటికి తాళాలేసుకున్నారా?: అనగాని
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాలుగేళ్ల పాలనలో కాపులకు జరిగిన అన్యాయం గత 40ఏళ్లలో ఎన్నడూ జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కాపులకు జరిగిన అన్యాయంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో మీ నోళ్లకు తాళాలు వేసుకున్నారా? అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు.