చిన్నిగుండెకు సాయం చేయరూ!

ABN , First Publish Date - 2023-05-26T03:57:29+05:30 IST

ఖాసింబీ...ఐదేళ్ల పాప. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఖాశీం, మస్రూన్‌ దంపతులకు పెళ్లయిన పన్నెండేళ్లకు పుట్టిన అపురూప సంతానం.

చిన్నిగుండెకు సాయం చేయరూ!

ఖాసింబీ...ఐదేళ్ల పాప. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఖాశీం, మస్రూన్‌ దంపతులకు పెళ్లయిన పన్నెండేళ్లకు పుట్టిన అపురూప సంతానం. అయితే కుమార్తెను చూసుకుని మురిసిపోయే అదృష్టం తండ్రికి దక్కలేదు. ఖాసింబీ తల్లి కడుపులో ఉండగానే పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ కుడికాల్వలో కొట్టుకుపోయి మరణించాడు. మస్రూన్‌ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పుట్టిన బిడ్డను సాకుతుండేది. ఆరునెలలు రాగానే ఖాసింబీకి అనారోగ్యం సోకడంతో తల్లి తల్లడిల్లిపోయింది. పిడుగురాళ్ల, గుంటూరు తదితర పట్టణాల్లో ఆస్పత్రుల చుట్టూ తిరిగి చివరకు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో చూపించగా పసిగుడ్డుకు గుండె సమస్య ఉందని తేల్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా పాపకు శస్త్ర చికిత్స చేశారు. పాపకు ఐదేళ్ల వయసు రాగానే రావాలని, మరో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పుడు మళ్లీ కిమ్స్‌కు వెళ్తే ఈసారి శస్త్ర చికిత్సకు సంబంధించి గుండెకు అమర్చేందుకు ట్యూబ్‌లు అవసరమవుతాయని, ఇందుకు రూ. 4 లక్షల దాకా ఖర్చవుతుందని చెప్పారు. ట్యూబ్‌ కొనుగోలు చేయాల్సిందేనని, ఆరోగ్య శ్రీ వర్తించదని చెప్పారు. పాచి పనులు, కూలీ పనులు చేసుకునే తల్లి మస్రూన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. తిరుపతిలోని వైద్యశాలలో చూపించగా, అక్కడి వైద్యులు మొదట శస్త్ర చికిత్స చేయించిన చోటనే ఈసారి కూడా చేయించాలని సూచించారు. కనీసంగా చార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. బిడ్డకు ఆపరేషన్‌ ఎలా అని ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. సాయం చేయదలచిన వారు.... షేక్‌ ఖాసీంబీ, షేక్‌ మస్రూన్‌, జాయింట్‌ అకౌంట్‌, యూనియన్‌ బ్యాంకు, అకౌంట్‌ నంబరు 202412120000020, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ యూబిఐఎన్‌0820245 లేదా ఫోన్‌ పే : 9010 712934 (షేక్‌ మహ్మద్‌ జాఫర్‌)లలో నగదు జమ చేయాలని అభ్యర్థిస్తోంది. పాప ఆరోగ్య పరిస్థితికి సంబంధించి సమాచారం కోసం సెల్‌: 99127 49775ను సంప్రతించాలన్నారు. -మాచర్ల

Updated Date - 2023-05-26T03:57:29+05:30 IST