ప్రయోగ వేదికపైకి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌12 రాకెట్‌

ABN , First Publish Date - 2023-05-26T03:55:39+05:30 IST

ప్రయోగ వేదికపైకి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌12 రాకెట్‌

ప్రయోగ వేదికపైకి  జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌12 రాకెట్‌

29న ఎన్‌వీఎ్‌స-01 ఉపగ్రహ ప్రయోగం

సూళ్లూరుపేట, మే 25: మరో మూడు రోజుల్లో ఇస్రో చేపట్టనున్న నావిగేషన్‌ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ నెల 29న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌12 రాకెట్‌ ద్వారా ఎన్‌వీఎ్‌స-01 (నావిక్‌-01) ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. ఈ రాకెట్‌ మూడు దశల అనుసంధాన పనులను పూర్తిచేసిన శాస్త్రవేత్తలు.. గురువారం దాన్ని రెండో ప్రయోగ వేదికకు తరలించి తుది పరీక్షలు నిర్వహించారు. దేశీయ నావిగేషన్‌ అవసరాల నిమిత్తం, దేశంలో దిక్సూచి వ్యవస్థ కోసం 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎ్‌స-01 ఉపగ్రహాన్ని ఇస్రో ప్ర యోగిస్తోంది. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29 ఉదయం 10:42 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌12 నింగిలోకి ఎగరనుంది.

Updated Date - 2023-05-26T03:55:39+05:30 IST