సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-05-26T03:16:36+05:30 IST
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

లోన్‌యా్‌ప ఒత్తిళ్లే కారణమని తండ్రి ఆరోపణ
పెద్దతిప్పసముద్రం, మే 25: లోన్‌యా్‌ప ఒత్తిళ్ల కారణంగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన జయరామిరెడ్డి, శ్యామల దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) హైదరాబాద్‌లోని క్యాప్‌జెమినిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం తండ్రి జయరామిరెడ్డికి ఫోన్‌చేసి తాను లోన్‌యా్‌పలో రుణం తీసుకున్నానని, దీనివల్ల అప్పులు పెరిగిపోయాయని చెప్పాడు. వెంటనే రూ.4 లక్షలు పంపాలని కోరాడు. వారంలోగా డబ్బులు సర్దుబాటు చేస్తానని తండ్రి తెలిపాడు. ఈ నేపథ్యంలో శ్రావణ్ బుధవారం రాత్రి స్వగ్రామానికి వచ్చాడు. కాగా, గురువారం ఉదయం మండలంలోని ఆకులవారిపల్లె సమీపంలోని పూతపలేశ్వరస్వామి ఆలయంలో గ్రిల్స్‌కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. లోన్‌యా్‌ప ఒత్తిళ్ల వల్లే తమ కుమారుడు మృతిచెంది ఉంటాడని జయరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.