కొలికపూడిపై చర్యలు తీసుకోండి
ABN , First Publish Date - 2023-09-18T02:47:52+05:30 IST
ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఓ టీవీ డిబేట్‌లో 12న అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోషియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోషియేషన్
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిపై ఓ టీవీ డిబేట్‌లో 12న అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ హైకోర్టు అడ్వొకేట్స్ అసోషియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘పొన్నవోలుపై ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం న్యాయ వ్యవస్థను కించపరిచేట్లు ఉన్నాయి. ఈ నెల 14న సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేసింది. కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశాం’’ అని పేర్కొంది. కాగా, రేపో మాపో ఈ కేసును సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.